Posts

ఓ చెలి తార!

అవును నువ్వు అక్షరాల తారవే! ఎప్పటికి నాకు అందని అద్భుతమైన తారవి.   స్వచ్ఛమైన మన ప్రేమ నిజమైనా చదువు , కట్టుబాట్లు , కులం , తల్లిదండ్రులో కారణాలేవైనా మనం విడిపోయాం కాని ఆ కలయిక తాలుకా జ్ఞాపకాల నుంచి మాత్రం బయటపడలేదు   పరిపక్వత లేని వయసో , కట్టుబాట్లో మనం పెద్దల మాటకి తలవంచి ముక్కలైన మనస్సులోని బాధని అణచుకొని ఎవరిదారిన వాళ్ళు నడిచాం...   కాలం చాలా బలమైంది నీ జ్ఞాపకాల బరువుల్ని మోస్తూ  ఉద్యోగం , పిల్లలు , బాధ్యతలు ఉరుకులు పరుగులతో సాగిపోయే జీవితంలోకి మరోసారి అనూహ్యంగా మళ్ళీ నీ రాక   కలవని జీవితాలైన ఏదో ఆశ ... నిత్యం నీ జ్ఞాపకాలతో విలపించే జీవితం నేనేమో పగటి సూర్యుడ్ని నువ్వేమో రాత్రి తారవి కలిసే వీలుందా? ఈ జీవితానికి ఇంతేనా ?